భారత్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా భారీ స్కోరు సాధించింది. ఉస్మాన్ ఖవాజా, గ్రీన్ సెంచరీలతో ఆసీస్ 480 పరుగులు చేసింది. రెండో రోజు కూడా కంగారూ బ్యాట్స్‌మెన్లు నిలకడగా ఆడారు. చివర్లో బౌలర్లు నాథన్ లియాన్, టాడ్ మర్ఫీ బౌలర్లను ముప్పు తిప్పలు పెట్టారు. అశ్విన్ అద్భుతమైన బౌలింగ్‌తో 6 వికెట్లు పడగొట్టాడు. జడేజా, అక్షర్ చెరో వికెట్ తీయగా, షమీ ఇద్దరిని పెవిలియన్ చేర్చాడు.