టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. జేసీతోపాటు ఆయన అనుచరుడు గోపాలరెడ్డి ఆస్తులను కూడా అటాచ్ చేసింది. మొత్తం రూ.22 కోట్ల విలువ చేసే ఆస్తులను అటాచ్ చేసింది. బీఎస్ 4 వాహనాల కొనుగోలులో వీరు అక్రమాలకు పాల్పడ్డట్లు ఈడీ గుర్తించింది. మొత్తం రూ.38 కోట్ల కుంభకోణానికి వీరిద్దరూ పాల్పడ్డట్లు వివరించింది. బ్యాంకు డిపాజిట్లు, బంగారం, స్థిరాస్తులు అన్నింటినీ ఈడీ సీజ్ చేసింది. వీరిపై 2020లోనే కేసు నమోదైంది.