బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తలపెట్టిన నిరసన దీక్షకు ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించారు. శుక్రవారం ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద భారత్ జాగృతి ఆధ్వర్యంలో నిరసన దీక్ష జరగనుంది. ఈ క్రమంలో ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించటంతో దీక్షపై సందిగ్ధత నెలకొంది. కాగా మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకురావాలనే డిమాండ్‌తో కవిత ఆధ్వర్యంలో దీక్ష చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ముందు అనుమతి ఇచ్చి.. ఇప్పుడు ఎలా నిరాకరిస్తారని కవిత ప్రశ్నించారు.
చెబితే ఒక్క రూపాయి ఇవ్వరు: కేసీఆర్