BigBoss: ఈ వారం నామినేట్ అయ్యింది వీళ్ళే

Courtesy Instagram:

బిగ్‌బాస్ నాన్ స్టాప్ వాడివేడిగా సాగుతుంది. కంటెస్టెంట్స్ అందరూ ఒకరిపై ఒకరు కామెంట్స్ చేస్తూ గేమ్ ఆడుతున్నారు. ఇందులో భాగంగా హౌజ్‌లో నిర్వహించిన ఎనిమిదో వారం నామినేషన్స్ హీటెక్కిపోయాయి. ఒకరిపై ఒకరు ఫోమ్ పూసుకుంటూ మరి నామినేట్ చేసుకున్నారు. ఒకరి తప్పును ఒకరు ఎత్తుకొని చూపి, నువ్వు ఇంత అంటే నువ్వు అంత అన్నట్టు హాట్ హాట్‌గా నామినేషన్ ప్రక్రియను కొనసాగించారు. మొత్తానికి ఎనిమిదవ వారం నామినేషన్స్‌లో అఖిల్, అనిల్, హమీదా, అషూరెడ్డి, అజయ్, బిందు నామినేట్ అవగా.. సీక్రెట్ రూమ్‌లో ఉన్న బాబా భాస్కర్‌కు బిగ్ బాస్ ఓ స్పెషల్ పవర్ ఇవ్వడంతో బిందును సేవ్ చేశాడు.

Exit mobile version