బిగ్‌బాస్ 4 విజేత అభిజిత్ రెండేళ్ల గ్యాప్ తర్వాత వెబ్‌సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అమెజాన్ ప్రైమ్ వీడియో ఒరిజినల్స్ మోడ్రన్ లవ్ హైదరాబాద్ వెబ్‌సిరీస్‌లో నటిస్తున్నాడు. ఆరు కథల సమ్మేళనంగా ఇది తెరకెక్కబోతుంది. నగేశ్ కుకునూర్, వెంకటేశ్ మహా, ఉదయ్ గుర్రాల, దేవికా బహుదానం.. ఈ నలుగురు డైరెక్టర్లు దీనికోసం పనిచేస్తున్నారు. ఆది పినిశెట్టి, సుహాసిని,రీతూ వర్మ, మాళవికా నాయర్, నిత్యామీనన్ వంటి వాళ్లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో జులై 8 నుంచి స్ట్రీమ్ కానుంది.