కెప్టెన్సీ కోసం ఈవారం రైనింగ్ లైక్స్ టాస్క్ పెట్టాడు బిగ్‌బాస్. ఇంటి పైనుంచి లైక్స్ వర్షం కురుస్తుంది. ఎవరు ఎక్కువ పట్టుకుంటే వారు పోటీదారులు అవుతారు. ఆ తర్వాత ఫాలోవర్స్‌ను పెంచుకునే మరో టాస్క్‌ను పెట్టాడు. అందులో ఇంటి సభ్యులు మూడు గ్రూప్‌లుగా విడిపోయి స్కిట్స్ చేశారు. ఎంటర్‌టైన్‌మెంట్, డ్రామా, రొమాన్స్ థీమ్‌లతో చేసిన ఈ స్కిట్స్‌లో ఎవరు బాగా చేశారో వారికి లైక్స్ ఇవ్వాలని చెప్పాడు. శివకు ఈ టాస్క్‌లో ఎక్కువగా 5 లైక్స్ వచ్చాయి. తక్కువగా ఉన్న హమీదా, అరియానా, సరయులో ఎవరినో ఒకరిని సెలక్ట్ చేయాలని కెప్టెన్ అనీల్‌కు బిగ్‌బాస్ సూచించాడు. దీంతో అనీల్ సరయును కెప్టెన్సీ పోటీదారుగా ఎన్నుకుంటున్నాడు చెప్పాడు. అరియానా, హమీదా ఇంతకుముందు మూడు సార్లు పోటీచేశారు కాబట్టి, ఈసారి సరయుకి ఛాన్స్ ఇవ్వాలనుకుంటున్నా అని చెప్పాడు. అనీల్ తీసుకున్న ఈ నిర్ణయం హమీదా, అరియానాలకు నచ్చలేదు. మరి ఈరోజు ఎపిసోడ్‌లో వచ్చే వారానికి ఎవరు కెప్టెన్ కాబోతున్నారో తెలుస్తుంది.