బిగ్‌బాస్‌లో ఆదివారం కంటే సోమవారం ఎపిసోడ్ కోసం ఎక్కువగా ఎదురుచూసే ఫ్యాన్స్ ఉన్నారు. ఎందుకంటే సోమవారం నామినేషన్స్‌లో జరిగే రచ్చ అంతా ఇంతా కాదు. ఈసారి నామినేషన్స్ కోసం రసవత్తరమైన టాస్క్ పెట్టాడు బిగ్‌బాస్. ట్రక్ ఒకటి పెట్టి, లివింగ్ రూమ్‌లో ఒక హర్న్ పెట్టాడు. ట్రక్ మొదటగా ఎక్కిన వ్యక్తి ఇద్దరు కుటుంబ సభ్యులను నామినేట్ చేయాలి. మిగతా కుటుంబసభ్యులు వారి నుంచి ఒకరిని సేవ్ చేసే అవకాశం కల్పించాడు. దీంతో మొత్తం గేమ్ మారిపోయే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇద్దరి బెస్ట్ ఫ్రెండ్స్ మధ్య పోటీ పెట్టి ఎదుటివారిని ఎందుకు నామినేట్ చేసి, వారిని ఎందుకు సేవ్ చేయాలో సొంతంగా వాదించుకోవాల్సి ఉంటుంది. మరి ఈ వారం నామినేషన్స్‌లోకి ఎవరెవరు వస్తారో ఈరోజు ఎపిసోడ్లో చూడాల్సిందే.