బిగ్‌బాస్ హౌజ్‌లో ఈ వారం ‘టిక్కెట్ టు ఫినాలే’ రేస్ జరుగుతుంది. ఇందులో భాగంగా గత సీజన్లో టాప్ 5 కంటెస్టెంట్స్ వచ్చి గేమ్ ఆడిస్తున్నారు. నిన్న సిరి హౌజ్‌లోకి వచ్చి సంచాలక్‌గా ఫోకస్ గేమ్ నిర్వహించింది. ఇందులో బాబా మాస్టర్ టిక్కెట్ టు ఫినాలే రేస్‌లో మొదటి కంటెస్టెంట్‌గా నిలిచాడు. ఈరోజు మానస్ బిగ్‌బాస్‌లోకి వస్తున్నాడు. మానస్‌ను మళ్లీ బిగ్‌బాస్‌లో చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీంతో ఈరోజు ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది.