ఈ వారం కెప్టెన్సీ కోసం దశలవారిగా టాస్క్‌లు ఇస్తున్నాడు బిగ్‌బాస్. నిన్న అరియానాను ఏడిపించాలని టాస్క్ ఇచ్చాడు. దీంతో అషూ రెడ్డి నేను ఏడిపిస్తాను అని చెప్పింది. అరియానాకు ఇష్టమైన మొక్కను తెచ్చి అందులో ఉన్న మట్టిని తీసి అరియానా మొహానికి పూసింది. కానీ అరియానా స్పందించలేదు. కోపం వస్తున్నా కంట్రోల్ చేసుకొని ఏం మాట్లాడకుండా సైలెంట్‌గా ఉండిపోయింది. అరియానా ఏడవకపోవడంతో టాస్క్ విఫలమయిందని చెప్పాడు బిగ్‌బాస్. టాస్క్ ముగిసిన తర్వాత దగ్గరికి వెళ్లి అషూ సారి చెప్పినప్పటికీ అరియారా క్షమించలేదు. నాకు కొంచెం టైమ్ కావాలి. తర్వాత మాట్లాడదాం అని చెప్పింది. మరి వీరిద్దరి ఫ్రెండ్షిప్ ముందులాగానే కొనసాగుతుందా. మనసులో కోపం పెట్టుకొని దూరం అవుతారా అనేది చూడాల్సి ఉంది.