బిగ్‌బాస్‌లో నామినేషన్స్ ముగిసినప్పటికీ నటరాజ్ మాస్టర్ ఛాన్స్ దొరికినప్పుడల్లా బిందు, శివలపై విరుచుకుపడుతున్నాడు. ఇప్పటివరకు ఒక్క టాస్క్ ఆడకుండా బెడ్‌పై కాళ్లు ఊపుతూ కూర్చుంటుంది. చెన్నై నుంచి బిగ్‌బాస్ కోసమే వచ్చింది, మళ్లీ వెళ్లిపోతుంది. ఆమెకు తెలుగువాళ్లు ఎలా ఓట్లు వేస్తున్నారు అంటూ నేరుగా కెమెరాల దగ్గరకు వచ్చి ప్రేక్షకులనే అడుగుతున్నాడు. ఇక శివ..అషుని షర్ట్ బటన్స్ తీయమని అడిగాడు. అతడికి ఇంట్లో ఉండే అర్హత కూడా లేదంటూ అవకాశం వచ్చిన ప్రతీసారి ఆ విషయాన్ని గుర్తుచేస్తున్నాడు. ఫ్యామిలీ వీక్‌లో అందరూ వచ్చి బిందును రెండో స్థానంలో, శివను టాప్-5 లో పెట్టడంతో అది నటరాజ్ జీర్ణించుకోలేకపోతున్నాడు.