Biggboss OTT: అఖిల్-బిందు మ‌ద్య మాట‌ల యుద్ధం

ఈరోజు బిగ్‌బాస్‌లో నామినేష‌న్స్ వాడివేడిగా జ‌రుగుతున్నాయి. ఈ వారం జంట నామినేష‌న్స్ పెట్టాడు బిగ్‌బాస్. అంటే ఇద్ద‌రి జంట‌ను సెల‌క్ట్ చేసి..వాళ్లిద్ద‌రిలో ఒక‌రు నామినేష‌న్స్‌లోకి ఎందుకు వెళ్లాలో వాదించుకోవాల్సి ఉంటుంది. దీంతో న‌ట‌రాజ్ మాస్ట‌ర్-శివ‌, అఖిల్-బిందు మ‌ద్య గొడ‌వ‌లు పీక్స్‌కు చేరాయి. నిన్న శివ కార‌ణంగా నాగార్జున తిట్ట‌డంతో ఆ కోపాన్ని నామినేష‌న్స్‌లో చూపిస్తున్నాడు న‌ట‌రాజ్‌. ఇక బిందు-అఖిల్ మ‌ద్య మాట‌లు హ‌ద్దు మీరాయి. ఒరేయ్‌ అఖిల్‌గా చెప్పురా అని బిందు అంటే..ఒసేయ్ బిందు ఏం చెప్పాలే నీకు అంటూ అఖిల్ రెచ్చిపోయాడు. ఇదంతా చూస్తుంటే ఈరోజు ఎపిసోడ్ హాట్‌హాట్‌గా ఉండ‌బోతుంద‌ని తెలుస్తుంది. మ‌రి ఎవ‌రెవ‌రు ఈవారం నామినేష‌న్స్‌లో ఉండ‌బోతున్నారో చూడాలి.
"Ey, Bindu! Em cheppaali neeku?!" | Bigg Boss Non-Stop Day 43 Promo 1 | DisneyPlus Hotstar Telugu

Exit mobile version