బిగ్‌బాస్ హౌస్‌లో ఎటువంటి టాస్క్‌లు లేకుండా కంటెస్టెంట్స్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. వారి బిగ్‌బాస్ జర్నీని చూస్తూ అందరూ ఎమోషనల్ అయ్యారు. ఈరోజు చివరగా బిందుమాధవి ఏవీని చూపిస్తున్నారు. దీన్ని చాలా పవర్‌ఫుల్‌గా డిజైన్ చేసినట్లు తెలుస్తుంది. ఆడపులి అంటూ బింధును బగ్‌బాస్ ప్రశంసలతో ముంచెత్తుతున్నాడు. బగ్‌బాస్ ఓటీటీ విన్నర్ బిందుమాధవి అంటూ వార్తలు ఇప్పటికే సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. సీజన్ 4లో రన్నరప్‌గా నిలిచిన అఖిల్ సార్థక్ ఈసారి కూడా రన్నర్‌గానే నిలిచినట్లు సమాచారం.