బిగ్‌బాస్ ఫేమ్ ఆర్జే కాజల్ తన హోమ్టూర్ను షేర్ చేసింది. బిగ్‌బాస్‌లో ఆమె ధైర్య సాహసాలతో ప్రేక్షకులను మెప్పించింది. కాజల్ హోమ్‌టూర్ వీడియో ఇప్పుడు యూట్యూబ్‌లో ట్రెండింగ్‌గా మారింది. త్వరలోనే ఆ ఇంటిని వదిలేసి కొత్త ఇంటికి మారుతున్న నేపథ్యంలో ఈ ఇంటి జ్ఞాపకాలు తనకు ఎప్పటికీ గుర్తుగా ఉండేందుకు ఈ వీడియో చేస్తున్నాని చెప్పుకొచ్చింది. తన స్కూల్, కాలేజీ అలాగే వివిధ షోలలో గెల్చుకున్న అవార్డులను చూపించింది. ఆర్జే కాజల్ ఇంటిపై మీరూ ఓ లుక్కేయండి.