పరీక్షల్లో ఫెయిల్ అయితేనే కొందరు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటారు. తమ జీవితం అయిపోయిందంటూ బాధపడుతూ ఉంటారు. అయితే బీహార్‌కు చెందిన కౌశ్లేంద్ర కుమార్ అలియాస్ సూరజ్(22) జైల్లో ఉంటూ చదువుతూనే ఐఐటీలో ర్యాంకు సాధించాడు. ఓ మర్డర్ కేసులో జైలు పాలైన ఇతడు, తన భవిష్యత్తుపై ఆశలు వదులుకోకుండా పట్టుదలతో చదివి ఐఐటీ రూర్కీ ప్రవేశ పరీక్షల్లో జాతీయ స్థాయిలో 54వ ర్యాంకు సాధించి తన సత్తా చాటాడు.