బీహార్ సీఎం నితీశ్ కుమార్ బోటు ప్రమాదంలో గాయపడ్డారు. రాజధాని పాట్నాలో గంగానది స్నాన ఘాట్ల వద్ద ఛత్ పూజ ఏర్పాట్లను పరిశీలిస్తుండగా ఈ సంఘటన జరిగింది. ఆయన ప్రయాణించిన బోటు ఒక పిల్లర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సీఎం నితీశ్ కుమార్ గాయపడ్డారు. ఆయన కడుపు, కాలికి గాయాలయ్యాయి. అయితే బోటులోని వారంతా ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడినట్లు అధికారులు తెలిపారు.