ఏపీలోని 52 ప్రాంతాల్లో బిజిలీ మహోత్సవం ఆదివారం ప్రారంభమైంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా నిర్వహిస్తున్నారు. అన్ని రాష్ట్రాల్లో కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఇంధన భద్రత, సంస్కరణల కోసం 7 రోజుల పాటు నిర్వహించనున్నారు. ‘ఉజ్వల్ భారత్, ఉజ్వల్ బహ్విష్యత్–పవర్@2047 పేరుతో ఈ కార్యక్రమం చేపడుతున్నారు. జూలై 30న ‘బిజిలీ మహోత్సవ్’ గ్రాండ్ ఫినాలే సందర్భంగా ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా ఉన్న విద్యుత్ లబ్ధిదారులతో ప్రసంగించనున్నారు.
ఏపీలో 52 ప్రాంతాల్లో బిజిలీ మహోత్సవం షురూ

Screengrab Twitter: