నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా.. క్యాథెరిన్ త్రెసా, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా మల్లిడి వసిష్ఠ ‘బింబిసారా’ మూవీని తెరకెక్కించాడు. ఆగష్టు 5వ తేదీన విడుదల కానున్న ఈ మూవీ ప్రమోషన్స్ భారీగా జరుగుతున్నాయి. అందులో భాగంగా డైరెక్టర్ వశిష్ఠ మూవీ గురించి ఓ ఆసక్తికరమైన వార్త చెప్పాడు. ఈ సినిమాను రెండు పార్టులుగా చూపిస్తున్నామని తెలిపాడు. తరువాత ‘బింబిసారా 2’ ఉంటుందని వెల్లడించాడు. ‘బింబిసారా’ పాత్ర ఓ సూపర్ మ్యాన్ లాంటి పాత్ర అని, 3, 4 భాగాలు కూడా చూపించొచ్చని పేర్కొన్నాడు.