కళ్యాణ్‌రామ్ హీరోగా నటించిన ‘బింబిసార’ మూవీ నేడు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ అయింది. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా గురించి ట్విట్టర్‌లో పాజిటివ్ రివ్యూలు వినిపిస్తున్నాయి. ప్రారంభంలో కాస్త నెమ్మదగా సాగినా కాసేపటికే కథలో వేగం పుంజకుంటుందని చెప్తున్నారు. కీరవాణి బీజీఎం అదిరిపోయింది. కొత్త డైరెక్టర్ వశిష్ఠ మొదటి సినిమాతోనే తన ప్రతిభన కనబరిచాడు. వీఎఫ్ఎక్స్, నిర్మాణ విలువలు బాగున్నాయి. కళ్యాణ్‌రామ్ కొత్త అవతారంలో ఇరగదీశాడని, ఇది ఆయన కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ అవుతుందని చెప్తున్నారు.