సామాజిక మాధ్యమాల్లో నేతలందరూ చురుగ్గా వ్యవహరించాలని భాజపా ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సూచించారు. పార్టీకి సంబంధించిన సరల్ మెుబైల్ యాప్‌పై అవగాహన సదస్సులో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏపీకి చేస్తున్న సాయం గురించి సోషల్ మీడియా వేదిక ద్వారా వివరించాలని నేతలకూ దిశానిర్దేశం చేశారు. భాజపా భావజాలాన్ని గ్రామస్థాయిలోకి తీసుకెళ్లాలనేది లక్ష్యం. వచ్చే 15 నెలలపాటు 15 రోజులకో కేంద్రమంత్రి రాష్ట్రంలో పర్యటించి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు.