ఆంధ్రప్రదేశ్లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి తెలుగుదేశంతో పొత్తు ఉండదని నేతలు స్పష్టం చేశారు. కానీ జనసేన పార్టీతో పొత్తు కొనసాగించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. రెండ్రోజుల క్రితం కర్నూలులో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో భాగంగా అగ్రనేతలు పేర్కొన్నారు. ఈ భేటీకి మొత్తం 13 జిల్లాల బీజేపీ అధ్యక్షులు, వివిధ నియోజకవర్గాల పార్టీ ఇంచార్జ్లు, నేతలు హాజరయ్యారు. ఈ క్రమంలో వైఎస్సార్ పార్టీ వ్యతిరేక శక్తుల ఐక్యతపై జనసేన అధినేత పవన్ ప్రస్తావించిన అంశం గురించి అధిష్టానం ఆరా తీసినట్లు సమాచారం. మరోవైపు పవన్ బీజేపీతో కలిసి వెళ్లాలా లేదా టీడీపీతో చేతులు కలపాలా అనేది ఆయనే నిర్ణయించుకోవాలని బీజేపీ నేతలు సూచించారు.