రాజస్థాన్‌లో బీజేపీ నేత హత్య

రాజస్థాన్‌లో బీజేపీ నాయకుడు కిర్పాల్‌ సింగ్‌ను దుండగులు కాల్చి చంపారు. భరత్‌పూర్‌ పీఎస్‌ పరిధిలో ఈ దారుణం జరిగింది. భరత్‌పూర్‌ బీజేపీ ఎంపీ రంజితా కోలికి సన్నిహితుడైన కిర్పాల్‌ సింగ్‌, ఆదివారం రాత్రి హత్యకు గురయ్యారు. సర్క్యూట్‌ హౌజ్‌ నుంచి తన ఇంటికి తిరిగివెళ్తుండగా ద్విచక్ర వాహనాలపై వెంబడించిన దుండగులు తుపాకులతో కాల్పులకు తెగబడ్డారు. ఘటనలో కిర్పాల్‌ సింగ్‌కు ఏడు బుల్లెట్లు తగిలాయి. నిందితులను గుర్తించిన పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు. హత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

Exit mobile version