సౌత్ బెంగళూరు ఎంపీ తేజస్వి సూర్య విమానంలో ఎమర్జెన్సీ డోర్ తెరిచి వివాదానికి తెర తీశారు. ఇండిగో విమానంలో చెన్నై నుంచి తిరుచురాపల్లికి ప్రయాణిస్తుండగా ఆయన అత్యవసర ద్వారం తెరిచారు. ఈ ఘటనతో విమానం 2 గంటలు ఆలస్యంగా బయలుదేరింది. దీనిపై అప్పుడే తేజస్వి క్షమాపణలు చెప్పినట్లు విమానయానశాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. సింధియా ప్రకటనపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. సామాన్యుడైతే క్షమాపణతో వదిలేస్తారా? అంటూ ప్రశ్నిస్తున్నారు.