బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ట్విట్టర్ అకౌంట్ హ్యాకింగ్‌కు గురైంది. ఈ మేరకు తన అధికారిక అకౌంట్ నుంచి, ఉక్రెయిన్‌కు సహాయాన్ని అందిస్తున్నామని, అందుకోసం క్రిప్టో కరెన్సీ స్వీకరిస్తున్నామని పోస్టులు చేశారు హ్యాకర్లు. బిట్ కాయిన్, ఇథెరియం కాయిన్లు స్వీకరిస్తున్నామని, క్రిప్టో విరాళాలు అన్ని ఉక్రెయిన్‌కు అందిస్తామని పేర్కొన్నారు. దీంతో వెంటనే స్పందించి, నడ్డా అకౌంట్‌ను రిస్టోర్ చేసుకున్నారు. హ్యాకర్లు చేసిన పోస్టులను డిలీట్ చేశారు.