మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం క్షణానికో మలుపు తిరుగుతోంది. తాజాగా శివసేన ఎంపీ సంజయ్ రౌత్ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. మహా అఘాడీ కూటమిని కాపాడే ప్రయత్నం చేస్తే.. శరద్ పవార్ ఇంటికి వెళ్లరని భాజపా మంత్రి బెదిరిస్తున్నారని సంజయ్ రౌత్ ట్వీట్ చేశారు. మోదీ, అమిత్ షాలే ఇది చేయిస్తున్నారా అని ప్రశ్నించారు. పవార్ ను ఉద్దేశించి అలా మాట్లాడటం తగదని సంజయ్ రౌత్ హితవు పలికారు. మరోవైపు ఏక్‌నాథ్ షిండే క్యాంపులోకి చేరిన రెబల్స్ సంఖ్య 50కి చేరింది. దీంతో మరాఠా రాజకీయాలు మరింత రసవత్తరంగా మారాయి.