గోవాలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు పూర్తయ్యాయి. గురువారం ప్రకటించిన ఫలితాల్లో భాజపా 20 స్థానాల్లో గెలిచింది. 40 మంది సభ్యులున్న గోవాలో మెజారిటీ సాధించాలంటే 21 సీట్లలో విజయం సాధించాలి. కాని భారతీయ జనతా పార్టీ మ్యాజిక్ ఫిగర్ కు 1 స్థానం తక్కువగా ఉంది. మరోవైపు కాంగ్రెస్ 12 చోట్ల, ఆప్ -2, తృణమూల్ కాంగ్రెస్ రెండు ప్రాంతాల్లో గెలుపొందాయి. ఫిబ్రవరి 14న ఒకే దశలో ఎన్నికలు జరుగగా, మొత్తం 332 మంది అభ్యర్థులు పోటీకి దిగారు.