గుజరాత్లో మరోసారి భాజపానే గెలుస్తుందని ఎగ్జిట్ పోల్స్ ద్వారా స్పష్టమవుతోంది. సుమారు 100కి పైగా స్థానాల్లో కమలం విజయం సాధిస్తుందని అంచనా వేశాయి.. రెండోస్థానంలో కాంగ్రెస్, మూడో స్థానంలో ఆప్ ఉంటాయని వెల్లడించాయి. పీపుల్స్ పల్స్ ప్రకారం భాజపాకు 125-143, కాంగ్రెస్ 30-48, ఆప్ 3-7 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. ఔట్ ఆఫ్ ది బాక్స్ ప్రకారం భాజపా 135-145, కాంగ్రెస్ 25-35, ఆప్ 5-7 స్థానాలు కైవసం చేసుకుంటాయని పేర్కొంది.