గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అధికార భాజపా వరాల జల్లు కురిపించింది. అభివృద్ధే లక్ష్యంగా మేనిఫెస్టోను రూపొందించి విడుదల చేసింది. ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేస్తామని, రాష్ట్రంలో 20లక్షల ఉద్యోగావకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చింది. వచ్చే ఐదేళ్లలో మహిళలకు లక్ష ప్రభుత్వ ఉద్యోగాల కల్పన; మహిళలు, వృద్ధులకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని మేనిఫెస్టోలో పేర్కొంది. ఉగ్రమూకలకు సహకరించే స్లీపర్ సెల్స్ నిర్మూలనకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తామని తెలిపింది. రూ10వేల కోట్లతో 20వేల ప్రభుత్వ స్కూళ్ల అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చింది.