రేపు హైదరబాద్- ఉప్పల్ స్టేడియం వేదికగా జరగనున్న భారత్- న్యూజిలాండ్ వన్డే మ్యాచ్కు మరోసారి బ్లాక్ టికెట్ల బెడద తాకింది. భారత్-న్యూజిలాండ్ వన్డే మ్యాచ్ బ్లాక్ టికెట్ల దందా జరుగుతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో బ్లాక్ టికెట్ల అమ్మకాలపై ప్రకటనలు వెలువడుతున్నాయి. రూ.1,500 టికెట్లను రెట్టింపు ధరకు కొన్ని ముఠాలు బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నట్లు తెలిసింది. ఈ బ్లాక్ మార్కెట్ దందాపై రాచకొండ SOT పోలీసుల నిఘా పెట్టారు.