మైనర్ విద్యార్థినుల అసభ్యకర వీడియోలను చిత్రీకరించి బ్లాక్ మెయిల్‌కు పాల్పడుతున్న ఉపాధ్యాయుడిని పోలీసులు అరెస్టు చేశారు. బిహార్‌లోని ఓ మదర్సాలో ఈ ఘటన జరిగింది. బాలికలను వేధిస్తున్నాడంటూ ఉపాధ్యాయుడు షాహదత్ హసన్‌పై విద్యార్థినులు పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేశారు. వీడియోలు తీసి బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో గత మూడేళ్లుగా అక్కడ బోధిస్తున్న షాహదత్ హసన్‌ని పోలీసులు అరెస్టు చేశారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు.