ఆస్ట్రేలియన్ దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ మృతి తర్వాత సరికొత్త అంశం వెలుగులోకి వచ్చింది. తాను ఉన్న హోటల్ గదిలోని టవల్స్, నేలపై రక్తపు మరకలు ఉన్నట్లు కనుగొన్నారు. ఈ మేరకు షేన్ వార్న్ ఉన్న గదిని థాయిలాండ్ పోలీసులు సోదా చేసినట్లు తెలిపారు. 52 ఏళ్ల వార్న్ తన స్నేహితులతో కలసి థాయ్‌లాండ్ గల్ఫ్‌లో ఉన్న ప్రముఖ ద్వీపం కో స్యామ్యూయ్కు వెళ్లినట్లు సమాచారం. అయితే ఈ అంశాన్ని అనుమానాస్పదంగా పరిగణించడం లేదని వైద్యులు తోసిపుచ్చినట్లు తెలిసింది.