మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ బాబీ తెరకెక్కిస్తున్న మాస్ ఎంటర్టైనర్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’. ఈ సినిమాలో ప్రముఖ నటుడు బాబీ సింహా నటిస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆయన పుట్టినరోజు సందర్భంగా ఓ పోస్టర్ని విడుదల చేసింది. ఇందులో సింహా ‘సొలోమన్ సీజర్’ అనే రోల్లో నటించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాలో ప్రత్యేక పాత్రలో రవితేజ నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన టీజర్ కూడా ఆకట్టుకుంటోంది. వచ్చే ఏడాది ఈ సినిమాను విడుదల చేయనున్నారు.
‘వాల్తేరు వీరయ్య’లో బాబీ సింహా

Courtesy Twitter:MythriMovieMakers