తమిళనాడులోని కళ్లకురిచి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. బాడీ షేమింగ్ చేశాడని ఓ 17 ఏళ్ల విద్యార్థి ప్రాణ స్నేహితుడిని హత్య చేశాడు. వివరాల ప్రకారం..ఇద్దరు స్నేహితులు ప్లస్ ఇంటర్ ఒకే విద్యాసంస్థలో చదువుకుంటున్నారు. నిందితుడి ఛాతి భాగం అమ్మాయి మాదిరిగా ఉందంటూ స్నేహితుడు అవహేళన చేశాడు. అలా మాట్లాడొద్దని చెప్పినప్పటికీ అతడు వినకుండ షేమింగ్ చేశాడు. దీంతో ఆ మాటలను మనసులో పెట్టుకున్న నిందితుడు చంపాలని నిర్ణయించుకున్నాడు. సాయంత్రం పార్టీ ఇస్తానని ఫ్రెండ్ని బైక్పై ఎక్కించుకొని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. బాధితుడు భోజనం చేస్తుండగా వెనుక నుంచి మెడపై కత్తితో దాడి చేశాడు. తదనాంతరం ఛాతిపై పొడిచి పొడిచి చంపాడు. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.