జాతి వివక్షకు ధీటైన జవాబు ఇచ్చి బాలీవుడ్ నటుడు సతీష్ షా అందరి మనసులు గెల్చుకున్నాడు. ఇటీవల లండన్‌లోని హీత్రూ విమానాశ్రయంలో విమానం ఎక్కుతున్న సమయంలో సతీష్ జాతి వివక్ష ఎదుర్కొన్నాడు. విమానం ఎక్కే సమయంలో అక్కడి సిబ్బంది సతీష్‌ను ఉద్దేశించి.. వీరు ఫస్ట్‌క్లాస్ టికెట్ ఎలా కొనగలరని హేళన చేశారు. దీనికి వెంటనే సతీష్ వాళ్ళ దగ్గరకు వెళ్లి మరీ.. ‘‘భారతీయులం కాబట్టి కొన్నాం’’ అంటూ గట్టిగా జవాబిచ్చాడు. ఈ విషయాన్ని సతీష్ ట్విటర్ ద్వారా షేర్ చేశారు.