బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ భార్య మీరాతో న్యూ ఇయర్ సంబరాలను జరుపుకొన్నాడు. ఈ బాలీవుడ్ దంపతులు న్యూ ఇయర్ శుభాకాంక్షలు చెబుతూ ఫొటోలను పోస్ట్ చేశారు. ఓ బీచ్లో సూర్యాస్తమయాన్ని ఆస్వాదిస్తున్న ఫొటోను మీరా కపూర్ షేర్ చేసుకుంటే.. స్విమ్మింగ్ పూల్లో దిగిన ఫొటోను పంచుకుంటూ ‘ఇప్పుడు నా ప్రొఫైల్ని షేర్ చేస్తున్నా’ అంటూ అందులో రాసుకొచ్చాడు. 2022 జ్ఞాపకాలను ఓ వీడియో రూపంలో పంచుకుంటూ ‘అలా 2022 ముగిసింది’ అంటూ మీరా షేర్ చేసింది. కాగా, వీరిద్దరూ 2015లో ఒక్కటయ్యారు. ఈ దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు.
-
Courtesy Instagram:ShaahidKapoor -
Courtesy Instagram:MiraKapoor