దిగ్గజ బాలీవుడ్ నటుడు, డైరెక్టర్ సతీష్ కౌశిక్(66) మృతిచెందారు. దేశ రాజధాని పరిధిలోని గురుగ్రామ్‌లో ఆయన గుండెపోటుకు గురయ్యారు. ఆసుపత్రికి తీసుకెళ్లగా పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచారు. పోస్ట్‌మార్టమ్ పూర్తయ్యాక ఆయన మృతదేహాన్ని నేడు ముంబయికి తీసుకురానున్నారు. తేరే నామ్, ప్రేమ్, హమ్ ఆప్‌కే దిల్‌మే రహెతే హై, రూప్ కీ రాణీ చోరోంకో రాజా తదితర సినిమాలకు సతీష్ కౌశిక్ దర్శకత్వం వహించారు. కాగా, డైరెక్టర్ మృతికి బాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.