తూర్పు ఉక్రెయిన్ లుహాన్స్క్లోని ఓ పాఠశాలపై రష్యా బాంబు దాడి జరిపినట్లు తెలిసింది. ఈ ఘటనలో 60 మంది మరణించారని ఆదివారం ప్రాంతీయ అధికారి తెలిపారు. దాడి సమయంలో 90 మంది ప్రజలు ఆ స్కూల్లో ఆశ్రయం పొందుతున్నట్లు చెప్పారు. మరికొంత మందిని కాపాడినట్లు వెల్లడించారు. ఇంకొంత మంది శిథిలాల కింద చిక్కుకున్నట్లు, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు. మరోవైపు దాడి ఘటనపై ఉక్రెయిన్, పాశ్చాత్య మిత్రదేశాలు రష్యా దళాలు పౌరులను లక్ష్యంగా చేసుకున్నాయని విమర్శించాయి.