ఉదయం నుంచి నష్టాలతోనే ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం కారణంగా చమురు ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. పలు దేశాల్లో కోవిడ్ కొత్త వేరియంట్ వ్యాపిస్తుండటం, లాక్ డౌన్ వంటి పలు అంశాల వల్ల మార్కెట్లు నష్టాల్లో పయనించాయి. ఈ నేపథ్యంలోనే స్టాక్ మార్కెట్ భారీగా నష్టాలను ఎదుర్కొంది. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ 571.44 పాయింట్లు కోల్పోయి 57292.49 వద్ద నిలిచింది. నిఫ్టీ 69.40 పాయింట్ల కోల్పోయి 17,117.60 వద్ద స్థిరపడింది.