బ్రిటన్ నూతన ప్రధానిగా పదవి చేపట్టేందుకు భారత సంతతికి చెందిన రిషి సునాక్‌కు మార్గం సుగమమైనట్లు కనిపిస్తోంది. పోటీ నుంచి మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ వైదొలగడం ఇందుకు కలిసి వస్తోంది. కన్జర్వేటివ్ నాయకుడిగా చట్టసభ సభ్యుల మద్దతు ఉన్నా, తాను వెనకబడి ఉన్నానని, పోటీ నుంచి తప్పుకోవడమే మేలని భావిస్తున్నట్లు బోరిస్ జాన్సన్ వెల్లడించారు. మరో నేత పెన్నీ మోర్డాంట్‌కు మెజారిటీ అంతంత మాత్రంగానే కనిపిస్తోంది. దీంతో రిషి సునాక్‌కు మార్గం సుగమమైనట్లు కనిపిస్తోంది.