ఏపీ పాలన రాజధానిగా విశాఖ కావడం జనసేన, టీడీపీలకు ఇష్టం లేదని మంత్రి బొత్స ఆరోపించారు. ‘జనసేన పార్టీ కాదు. ఓ వ్యక్తి పెట్టుకున్న సంస్థ. ఉత్తరాంధ్ర ప్రజలు బాగుపడటం సహించలేకపోతున్నారా? మూడు రాజధానులు కావాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నారు. కావాలంటే ఇంటింటికి వెళ్లి తెలుసుకోండి. టీడీపీ, జనసేన ఎన్ని కుట్రలు చేసినా మూడు రాజధానుల బిల్లు తెచ్చి తీరుతాం’ అని స్పష్టం చేశారు.