మంత్రి బొత్స సత్యనారాయణ ఏపీ రాజధానిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్న మొన్నటివరకు ఆంధ్రప్రదేశ్ కు మూడు రాజధానులంటూ సీఎం జగన్ చెబుతుంటే.. తాజాగా బొత్స ఏపీకి అమరావతి రాజధాని కాదని.. హైదరాబాదేనని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం 2024 వరకు రెండు తెలుగు రాష్ర్టాలకు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అన్నారు. దీంతో బొత్స వ్యాఖ్యలపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. హైకోర్టు ఇచ్చిన తీర్పుతో వైసీపీ నేతలకు మతి చెడిందని.. అవగాహన లేకుండా ఏదేదో మాట్లాడుతున్నారని విమర్శిస్తున్నారు.