ఆంధ్రప్రదేశ్ రాజధానుల అంశంపై పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక విషయం తెలిపారు. తాము 3 రాజధానుల విధానానికే కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. ఏపీలో అన్ని ప్రాంతాలు డెవలప్ చెందాలన్నదే తమ లక్ష్యమని వెల్లడించారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు తనకోసం మాత్రమే ఆలోచిస్తారని బొత్స ఆరోపించారు. ఏపీ రాజధాని అమరావతిగా పేర్కొంటూ కేంద్ర బడ్జెట్ 2022-23లో నిధులు కేటాయించడంతో ఈ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది.