తెలంగాణ మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యలపై బొత్స సత్యనారాయణ స్పందించారు. ఏపీలో ఉపాధ్యాయులపై కర్కశత్వం చూపిస్తోందన్న హరీశ్ వ్యాఖ్యలను బొత్స తిప్పికొట్టారు. ఏపీకి వచ్చి చూడాలని.. టీచర్లను ఎలా చూసుకుంటున్నామో తెలుస్తుందని ఆయన హితవు పలికారు. ‘టీచర్లు సంతోషంగా ఉన్నారు. బహుశా హరీశ్ ఏపీ గురించి మాట్లాడి ఉండకపోవచ్చు. వారు ఇక్కడికి వచ్చి చూస్తే టీచర్లను ఎలా చూసుకుంటున్నామో తెలిసిపోతుంది. ఏపీ, తెలంగాణ పీఆర్సీలలో తేడా చూడండి’ అని బొత్స పేర్కొన్నారు.
హరీశ్ వ్యాఖ్యలకు బొత్స కౌంటర్

Courtesy Twitter:@ani(file)