ప్రేమ మంచిదే కానీ అతిప్రేమ, అసూయ, అనుమానం అనేక అనర్థాలకు దారి తీస్తాయి. ఇందుకు ఊదాహరణే యూఎస్‌లోని టెక్సాస్‌లో జరిగిన సంఘటన. సెనాడియా మేరీ సోటో అనే 23 ఏళ్ల యువతి తన బాయ్‌ఫ్రెండ్ ఇంటిని తగులబెట్టింది. తన బాయ్‌ఫ్రెండ్‌కు ఫోన్ చేసినప్పుడు వేరే అమ్మాయి ఆన్సర్ చేసింది. దీంతో తీవ్ర ఆగ్రహంతో సోటో ఈ పనిచేసింది. అయితే తర్వాత తెలిసిందేంటంటే ఆ ఫోన్ ఎత్తిన అమ్మాయి, అబ్బాయి వాళ్ల బంధువట. పోలీసులు యువతిని అదుపులోకి తీసుకున్నారు.
‘బాయ్‌ఫ్రెండ్ ఇంటిని తగలబెట్టింది’

Fb:BexarCoSherrif