ప్రభుత్వ సంస్థ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఈవీ బాట పట్టింది. దేశవ్యాప్తంగా 7 వేల రిటైల్ అవుట్లెట్లలో ఎలక్ట్రిక్ వాహనాలకు చార్జింగ్ సదుపాయం కల్పించనుంది. తాజాగా బెంగళూరు-చెన్నై, బెంగళూరు-మైసూర్ మార్గాల్లో చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసింది. దేశంలోని అన్ని ప్రధాన నగరాలు, హైవేల్లో ఈవీ చార్జింగ్ స్టేషన్లను నెలకొల్పాలన్నది బీపీసీఎల్ ముఖ్య ఉద్దేశం.