దక్షిణ కొరియా తీవ్ర జనాభా సంక్షోభం ఎదుర్కొంటోంది. ప్రస్తుతం ఆ దేశంలో 5.2 కోట్ల మంది జనాభా ఉండగా.. ఆ సంఖ్య 2067 నాటికి 3.9 కోట్లకు పడిపోనుందని అంచనా. జనాభా పడిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే అక్కడి యువకులు 34 ఏళ్లు వస్తే గానీ పెళ్లి చేసుకోవడం లేదు. యువతులు కూడా 32 ఏళ్లకు పెళ్లి పీటలెక్కుతున్నారు. దీంతో వివాహాల సంఖ్య, జననాల సంఖ్య గణనీయంగా పడిపోతోంది. 2012లో 3.27 లక్షల వివాహాలు జరిగితే 2022లో కేవలం 1.92 లక్షల పెళ్లిళ్లు మాత్రమే జరిగాయి.