ఈ ఏడాది గూగుల్‌లో సినీ ప్రియులు ఎక్కువగా శోధించిన సినిమాల్లో ‘బ్రహ్మాస్త్ర’ తొలి స్థానంలో నిలిచింది. బాలీవుడ్ జంట రణ్‌బీర్ కపూర్- ఆలియా భట్ కలయికలో వచ్చిన ఈ సినిమా మోస్తరు విజయాన్ని సాధించింది. అయితే, బాయ్‌కాట్ ట్రెండ్ వివాదం చుట్టుముట్టినా పాజిటివ్ టాక్‌తో బయటపడి చతికిలపడుతున్న బాలీవుడ్ ఇండస్ట్రీకి ఊపిరిలూదింది. అనంతరం, కేజీఎఫ్2, ద కశ్మీర్ ఫైల్స్, ఆర్ఆర్ఆర్, కాంతార, పుష్ప, విక్రమ్, లాల్ సింగ్ చడ్డా, దృశ్యం2, థార్- ద లవ్ అండ్ థండర్ సినిమాలను అత్యధికంగా వెతికినట్లు గూగుల్ ఇండియా వెల్లడించింది. కాగా, సెప్టెంబరు నెలాఖరులో విడుదలైన కాంతార ప్రభంజనం సృష్టించింది.