హైదరాబాద్ బన్సీలాల్ పేట్లో పునరుద్ధరించిన మెట్ల బావిని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. భవిష్యత్ తరాలకు చరిత్రను అందించాలనే ఉద్దేశంతో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో చర్యలు చేపట్టారు. సహిత స్వచ్ఛంద సంస్థ సహకారంతో బావిలో పేరుకుపోయిన చెత్త చెదారం తొలగించి సరికొత్తగా తీర్చిదిద్దారు. బన్సీలాల్పేట్లో 3 దశాబ్దాల క్రితం బావిని.. పర్యాటకుల సౌకర్యార్థం మళ్లీ అందుబాటులోకి తీసుకువచ్చారు. నాటి వైభవాన్ని మళ్లీ కల్లకు కట్టేలా రూపొందించారు.