బ్రెజిల్ నూతన అధ్యక్షుడు లూలా డ సిల్వా కీలక నిర్ణయం తీసుకున్నారు. అధ్యక్ష భవనానికి చెందిన 40మంది భద్రతా సిబ్బందిని విధుల్లోంచి తొలగించారు. మిలిటరీపై అపనమ్మకంతోనే అధ్యక్షుడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన బ్రెజిల్ అల్లర్లలో అధ్యక్షుడి భవనం ఎదుట భద్రతా వైఫల్యం స్పష్టంగా కనిపించింది. ప్రెసిడెంట్ ప్యాలెస్ అల్వరొడాపై విధ్వంసానికి ఎగబడిన వారిని నిలువరించడంలో భద్రతా సిబ్బంది సఫలం కాలేకపోయారు. దీంతో పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగాయి. ఈ మేరకు భద్రతా అధికారులను తొలగిస్తున్నట్లు ఓ గెజిట్ విడుదల చేసినట్లు సమాచారం.