తెలంగాణ ప్రభుత్వం కాంట్రాక్టు ఉంద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో ఉన్న 11వేల పైచిలుకు కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులైజ్ చేస్తామని సీఎం ప్రకటించడంతో.. వారిని రెగ్యులైజ్ చేసేందుకు ఆర్ధిక శాఖ అనుమతినిచ్చింది. 2016లో జారీ చేసిన జీవో 16 ప్రకారం అర్హులైన ఉద్యోగులందరూ తమ తమ వివరాలు పంపాలని ఆర్థిక శాఖ కోరింది. అర్హులైన ఉద్యోగులందరినీ రెగ్యులైజ్ చేస్తామని ప్రభుత్వం తెలిపింది.