ఏపీ మాజీ మంత్రి, టీడీపీ పార్టీ సీనియర్ నేత బొజ్జల గోపాల కృష్ణారెడ్డి(73) నేడు మృతి చెందారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. నేడు హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో గుండెపోటుతో చికిత్స పొందుతూ మృతి చెందారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి 5 సార్లు ఎమ్మెల్యే గెలిచిన ఆయన.. ఉమ్మడి ఏపీలో మంత్రిగా పని చేశారు.